2018 తెలంగాణ ఎన్నికల్లో ఆ సంస్థ ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమయ్యాయి.. ఈ ఎన్నికల్లో ఇప్పుడు ఏం చెప్పిందంటే..!
- బీఆర్ఎస్ గెలుస్తుందని గత ఎన్నికల్లో చెప్పిన ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్
- చెప్పినట్టుగానే ఘన విజయం సాధించిన బీఆర్ఎస్
- ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 63 నుంచి 79 స్థానాల్లో గెలుస్తుందని వెల్లడి
బీఆర్ఎస్ కు 62 నుంచి 70 సీట్లు వస్తాయని అప్పట్లో ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. చెప్పినట్టుగానే బీఆర్ఎస్ అధికారాన్ని కైవసం చేసుకుంది. 88 స్థానాల్లో గెలుపొంది మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ 63 నుంచి 79 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. బీఆర్ఎస్ 31 నుంచి 47 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. ఈ అంచనాలు ఎంత వరకు నిజమవుతాయో వేచి చూడాలి.