ఇటు ప్రభాస్ .. అటు కమల్: 'కల్కి 2898 AD' అప్ డేట్!
- ప్రభాస్ పాన్ ఇండియా మూవీగా 'కల్కి'
- కీలకమైన పాత్రను పోషిస్తున్న కమల్
- హైదరాబాదులో జరుగుతున్న షూటింగ్
- వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సినిమాలో కమలహాసన్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పాత్రను నాగ్ అశ్విన్ డిజైన్ చేసిన తీరు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని అంటున్నారు. కొన్ని రోజులుగా కమల్ - ప్రభాస్ కాంబినేషన్లోని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ప్రభాస్ - కమల్ కాంబినేషన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. సాంకేతిక పరంగా ఈ సినిమా హాలీవుడ్ సినిమాలను తలపిస్తుందని అంటున్నారు. సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిస్తుందనే టాక్ ఉంది. అమితాబ్ .. దీపికా పదుకొణే .. దిశా పటాని ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమా, వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.