కశ్మీర్ శారదా దేవి ఆలయంలో 75 ఏళ్లకు మళ్లీ దీపావళి!
- కుప్వారా జిల్లాలోని శారదా దేవీ ఆలయంలో 1948 తరువాత తొలిసారిగా దీపావళి
- దీపకాంతులతో మెరిసిపోతున్న దేవాలయానికి పోటెత్తిన భక్తులు
- ప్రత్యేక పూజలు, బాణసంచా కాల్చి పులకించిపోయిన వైనం
వాస్తవాధీన రేఖకు సమీపంలోని ఈ దేవాలయాన్ని ఇటీవల పునరుద్ధరించారు. 1948 తరువాత ఇక్కడ దీపావళి జరగడం ఇదే తొలిసారి. అప్పటి భారత్-పాక్ విభజన నేపథ్యంలో గిరిజనుల దాడిలో ఈ దేవాలయం ధ్వంసమైంది. కాగా, ఈ గుడిని కార్తార్‌పూసాహిబ్ కారిడార్ రీతిలో అభివృద్ధి చేసి పునర్వైభవం తీసుకురావాలని శారదా పీఠం ట్రస్టు వ్యవస్థాపకుడు రవీందర్ పండిత కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.