తమిళనాడు-ఏపీ రోడ్ల మధ్య తేడాను చూపిస్తూ వీడియో షేర్ చేసిన కన్నా.. మీరూ చూడండి!
- ఏపీ రోడ్లపై విమర్శల వెల్లువ
- అవకాశం చిక్కినప్పుడల్లా విమర్శలు చేస్తున్న తెలంగాణ నేతలు
- వీడియో షేర్ చేసిన కన్నా లక్ష్మీనారాయణ
- అచ్చం కేసీఆర్ చెప్పినట్టే ఉన్నాయన్న కన్నా
ఇక, సామాజిక మాధ్యమాల్లో అయితే ఏపీ రోడ్లపై మీమ్స్‌కు, జోక్స్‌కు కొదవలేకుండా పోయింది. తాజాగా టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఓ వీడియోను పోస్టు చేస్తూ తమిళనాడు, ఏపీ రోడ్ల మధ్య వ్యత్యాసం ఇదేనని పేర్కొన్నారు. ఆంధ్రాకు వెళ్తే సింగిల్ రోడ్డు.. తెలంగాణ వస్తే డబుల్ రోడ్డు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్రా పరువు తీశారని పేర్కొన్నారు. ఆయన చెప్పింది అక్షరాలా నిజమని చెబుతూ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో తమిళనాడు నుంచి ఏపీలోకి దారితీసే రోడ్డు నున్నగా ఒక్క గతుకు కూడా లేకుండా ఉండగా.. సరిగ్గా ఏపీలోకి ప్రవేశించాక గుంతలమయంగా మారింది. అడుగుకు పది గుంతలు చొప్పున దర్శనమిచ్చాయి.