చంద్రబాబు అరెస్ట్ లో కేంద్రం పాత్ర.. జగన్ ను అడ్డం పెట్టుకుని కేంద్రం నాటకాలు ఆడుతోంది: కేవీపీ రామచంద్రరావు
- చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్రం పాత్ర ఉందనే విషయాన్ని ఎవరిని అడిగినా చెపుతారన్న కేవీపీ
- కేంద్రం కనుసన్నల్లోనే అంతా నడుస్తోందని వ్యాఖ్య
- మద్యాన్ని జగన్ ఆదాయ వనరుగా మార్చుకున్నారని విమర్శ
ఇదే సమయంలో జగన్ పై కేవీపీ విమర్శలు గుప్పించారు. మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన జగన్... అదే మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారని విమర్శించారు. మద్యం అమ్మకాలపై సరైన లెక్కలు లేవని... మద్యం అమ్మకాలలో నగదు మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. మద్యం అమ్మకాలపై ఎన్నో ఆరోపణలు వస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.