గ్రీన్ కార్డు దరఖాస్తు తొలి దశలోనే ఈఏడీ కార్డు.. వైట్ హౌస్ కమిటీ సిఫారసు
- గ్రీన్ కార్డు దరఖాస్తు ప్రక్రియకు కీలక మార్పులు సిఫారసు చేసిన వైట్‌హౌస్ కమిటీ
- దరఖాస్తు తొలి దశలోనే ఉద్యోగ అనుమతి కార్డు జారీ చేయాలని సూచన
- ఈ సిఫారసుకు అధ్యక్షుడు బైడెన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే భారతీయులకు భారీ లబ్ధి
ప్రస్తుత ప్రక్రియ ప్రకారం, గ్రీన్ కార్డు కోసం అభ్యర్థులు తొలుత ఐ-140 దరఖాస్తు చేయాలి. ఆ తరువాత ఈ ప్రక్రియ కీలక దశకు చేరుతుంది. ఈ దశలో స్టేటస్ సర్దుబాటు జరుగుతుంది. దీన్ని ఐ485గా పిలుస్తారు. ఈ దశలోనే ఈఏడీ కార్డు, ఇతర ట్రావెల్ డాక్యుమెంట్ల అడ్వాన్స్ పెరోల్‌ను జారీ చేస్తారు. దీంతో, అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా పనిచేసుకునేందుకు అవకాశం దక్కుతుంది. తాజా సిఫార్సు అమల్లోకి వస్తే ప్రభుత్వం ఐ-140 దశలోనే ఈఏడీ జారీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం గ్రీన్ కార్డు కోసం దశాబ్దాల తరబడి వేచి చూడాల్సి వస్తున్నందున ఈ సిఫారసు భారతీయులకు మేలు కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.