చంద్రబాబు కంటికి ఆపరేషన్ అవసరం లేదంటూ వైద్యుల నివేదిక.. జైలు అధికారులు మార్చేశారంటున్న టీడీపీ నేతలు
- బుధవారం చంద్రబాబును పరీక్షించిన ప్రభుత్వ వైద్యులు
- కంటికి చికిత్స అవసరమంటూ జైలు అధికారుల హెల్త్‌బులెటిన్
- టీడీపీ నేతల ఆరోపణలు నిజం కాదంటున్న జైలు సూపరింటెండెంట్
చంద్రబాబు కంటికి చికిత్స అవసరమని వైద్యులు చెబితే.. ఆ నివేదికను మార్చి ఇవ్వాలని వైద్యులపై జైలు అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ఈ ఆరోపణలపై జైలు సూపరింటెండెంట్ రాహుల్ వివరణ ఇస్తూ.. చంద్రబాబు నాలుగు నెలల క్రితం ఓ కంటికి ఆపరేషన్ చేయించుకున్నారని పేర్కొన్నారు. బుధవారం ఆయనను పరిశీలించిన ప్రభుత్వ వైద్యులు.. రెండో కంటికి వెంటనే ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారని వివరించారు.