కనిపించకుండా పోయిన గర్భిణి మృతి.. రాత్రంతా తల్లి శవం వద్దే నాలుగేళ్ల కుమారుడు
- మహారాష్ట్రంలోని చంద్రాపూర్‌లో ఘటన
- ఐస్‌క్రీం కోసం కుమారుడితో కలిసి బయటకు
- బురదలో కూరుకుపోయి చనిపోయి ఉంటుందని అనుమానం
- మృతిపై అన్ని కోణాల్లోనూ విచారణ
ఎంతసేపైనా ఆమె ఇంటికి చేరకపోవడంతో బ్యాంక్ ఉద్యోగి అయిన ఆమె భర్త పవన్ కుమార్ కాక్డే, ఇతర కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో బల్లార్‌పూర్ పోలీసులు ఆశ్రయించారు. ఈ క్రమంలో గురువారం ఉదయం వార్ధా నది వంతెన వద్ద సుష్మ మృతదేహాన్ని, పక్కనే ఏడుస్తున్న నాలుగేళ్ల బాబును గుర్తించిన స్థానికులు వెంటనే ఆమె భర్త పవన్‌కుమార్‌కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు తెల్లవారుజామున 4 గంటలకు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని బాబును వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బ్రిడ్జి సమీపంలోని బురదలో కూరుకుపోయి ఆమె మరణించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.