ఆన్‌లైన్ ఆటలతో కోటిన్నర గెలుచుకున్న ఎస్సైపై సస్పెన్షన్ వేటు
- ఫాంటసీ గేమింగ్ యాప్ డ్రీమ్11లో బెట్టింగ్‌తో కోటిన్నర గెలిచిన మహారాష్ట్ర ఎస్సై సోమ్‌నాథ్
- విధుల్లో ఉండి బెట్టింగ్‌కు దిగినందుకు ఎస్సైపై ఉన్నతాధికారుల ఆగ్రహం
- పోలీసు శాఖ పరువు తీసినందుకు సస్పెన్షన్ వేటు
సోమ్‌నాథ్ గత మూడు నెలలుగా డ్రీమ్11లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన ఇంగ్లండ్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో గొప్ప ఆటగాళ్లతో ఓ డ్రీమ్ టీం నిర్మించుకుని గెలుపొందారు. ఈ క్రమంలో రూ.1.5 కోట్లు గెలుచుకున్నారు. ఒక్కసారిగా అంత డబ్బు వచ్చినందుకు ఎస్సై కుటుంబమంతా సంబరాలు చేసుకోగా ఉన్నతాధికారుల చర్యలతో వారికి భారీ షాక్ తగిలింది.