చంద్రబాబుకు స్టెరాయిడ్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.. లోకేశ్ సంచలన ఆరోపణ
- చంద్రబాబు ఆరోగ్యంపై లోకేశ్ ఆందోళన
- ఆయనకు తక్షణ ముప్పు పొంచి ఉందని ఆవేదన
- చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిక
చంద్రబాబు భద్రత నిస్సందేహంగా ప్రమాదంలో పడిందని, ఉద్దేశపూర్వకంగా ఆయనకు హాని తలపెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యానికి తక్షణ ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. జైలు గదిలో దోమలు, కలుషిత నీరు ఉన్నాయని, బరువు తగ్గడం, ఇన్ఫెక్షన్లు, అలెర్జీలతో ఆయన బాధపడుతున్నారని, సకాలంలో వైద్యసాయం అందడం లేదని పేర్కొన్నారు.
చంద్రబాబుకు స్టెరాయిడ్లు ఎక్కించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ వైద్యులు, అధికార యంత్రాంగం ఏం దాచేందుకు ప్రయత్నిస్తోందని లోకేశ్ ప్రశ్నించారు. చంద్రబాబుకు ఏమైనా జరిగితే అందుకు వైఎస్ జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.