ఇక్కడేం జరిగిందో తెలుసుకోకపోవడం సిగ్గుగా అనిపించింది: అనసూయ భరద్వాజ్

Razakar movie update
  • తెలంగాణ నేపథ్యంతో రూపొందిన 'రజాకార్'
  • ఆ కాలంలో జరిగిన సంఘటనలకు దృశ్యరూపం 
  • చరిత్రను తెలుకోవాలన్న అనసూయ 
  • ఈ పాట హైలైట్ గా నిలుస్తుందని వెల్లడి  
తెలంగాణ నేపథ్యంలో రూపొందిన మరో సినిమా 'రజాకార్'. నారాయణ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి, సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. 'కశ్మీర్ కి కాపలా ఉంటూనే హైదరాబాదును కాపాడుకోవాలి' అంటూ ఆ మధ్య వచ్చిన టీజర్, పెద్ద చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి అనసూయ బృందంపై చిత్రీకరించిన 'భారతి భారతి ఉయ్యాలో' అనే పాటను ఫస్టు సింగిల్ గా రిలీజ్ చేశారు.
 
ఈ సాంగ్ లాంచ్ ఈవెంటులో పాల్గొన్న అనసూయ మాట్లాడుతూ .. "నేను పుట్టి పెరిగింది తెలంగాణలోనే. ఎక్కడెక్కడో జరిగిన చరిత్రను గురించి చిన్నప్పుడు బట్టీ పట్టాను గానీ, ఇక్కడ ఏం జరిగిందనేది తెలుసుకోకపోవడం నాకు సిగ్గుగా అనిపించింది. చరిత్రను తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అనే విషయం నాకు అర్థమైంది" అని అన్నారు. 

"గతంలో ఎక్కడైతే నిజమైన సంఘటలు జరిగాయో .. అక్కడే ఆ దృశ్యాలను చిత్రీకరించినట్టు మేకర్స్ చెప్పారు. కాసర్ల శ్యామ్ ఈ పాటను చాలా బాగా రాశారు. షూటింగు సమయంలో ఒకటి రెండు సార్లు ఎమోషన్ కి లోనయ్యాను కూడా. ఈ సినిమాలో నేను కూడా ఒక భాగమైనందుకు గర్వంగా ఉంది" అని చెప్పారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
Razakar
Aanasuya
Bheems
Sathyanarayana

More Telugu News