నమ్మకమే తోడుగా.. అంటూ కొడాలి నాని ట్వీట్

Kodali Nani tweet on Jagananna Suraksha
  • జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
  • ఈ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ కొడాలి నాని స్పందన
  • నమ్మకమే తోడుగా జగనన్న ఆరోగ్య సురక్ష తీరాలకు అంటూ ట్వీట్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత విశ్వాసపాత్రుల్లో ఎమ్మెల్యే కొడాలి నాని ఒకరు. జగన్ ను ఎవరు ఒక్క మాటన్నా ఆయనలోని ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుకుపడతారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై సైతం అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు ఆయన వెనుకాడరు. ఏపీ ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఒక్క రూపాయి కూడా కట్టకుండానే రోగులకు ఉచితంగా వైద్యం అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని ప్రశంసించే విధంగా తాజాగా కొడాలి నాని ఎక్స్ వేదికగా స్పందించారు. 'నమ్మకమే తోడుగా జగనన్న ఆరోగ్య సురక్ష తీరాలకు' అంటూ ఆయన ఒక పోస్టర్ ను షేర్ చేశారు. ఈ కార్యక్రమం కోసం వైద్య సిబ్బంది పడవలో వెళ్తున్నట్టుగా పోస్టర్ లో ఉంది. 

Go Back to Shorts
Kodali Nani
YSRCP
Jagan

More Telugu News