మధ్యాహ్నం విజయవాడకు చేరుకోనున్న పవన్.. రేపటి నుంచి టీడీపీతో కలిసి వారాహి యాత్ర
Add ap7am to your home Screen

మధ్యాహ్నం విజయవాడకు చేరుకోనున్న పవన్.. రేపటి నుంచి టీడీపీతో కలిసి వారాహి యాత్ర

Pawan Kalyan going to Vijayawada today
  • హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న పవన్
  • ఎయిర్ పోర్టు నుంచి నేరుగా మంగళగిరిలోని కార్యాలయానికి వెళ్లనున్న జనసేనాని
  • రేపు అవనిగడ్డలో ప్రారంభంకానున్న వారాహి యాత్ర
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాలుగో విడత వారాహి యాత్రి రేపటి నుంచి ప్రారంభం కానుంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి యాత్రను వపన్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి బయల్దేరి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. ఎయిర్ పోర్టు నుంచి ఆయన నేరుగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు. 

మరోవైపు కృష్ణా జిల్లాలో ఐదు రోజుల పాటు వారాహి యాత్ర కొనసాగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డలో బహిరంగసభ జరగనుంది. 2, 3 తేదీల్లో మచిలీపట్నంలో ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 2వ తేదీన జిల్లా నేతలతో సమావేశంలో, 3న జనవాణి కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు. 4, 5 తేదీల్లో పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు. మరోవైపు టీడీపీతో పొత్తు నేపథ్యంలో ఈసారి వారాహి యాత్రలో ఆ పార్టీ శ్రేణులు కూడా పాల్గొననున్నాయి. టీడీపీ, జనసేన కలయికతో ఈసారి వారాహి యాత్ర కొనసాగుతుందని నాదెండ్ల మనోహర్ ఇప్పటికే ప్రకటించారు.
Advertisement
Pawan Kalyan
Janasena
Vijayawada
Varahi Yatra
Telugudesam

More Telugu News