khalistan: అక్టోబర్ 5న నరేంద్రమోదీ స్టేడియాన్ని పేల్చేస్తాం: ఖలిస్థాన్ టెర్రరిస్ట్ హెచ్చరిక

Will Target World Cup Match At Narendra Modi Stadium On Oct 5
షార్ట్స్‌లో చూడండి
ఖలిస్థాని వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో తాజాగా ఖలిస్థాన్ టెర్రరిస్టు గుర్‌పత్వంత్ సింగ్ పన్ను మరోసారి హెచ్చరికలు జారీ చేశాడు. ముందుగానే రికార్డ్ చేసి విడుదల చేసిన ఆడియోలో... భారత్‌కు, ప్రధాని నరేంద్రమోదీకి ఈ హెచ్చరికలు జారీ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిక్ ఫర్ జస్టిస్ గ్రూప్ నుంచి తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు.

ఐసీసీ ప్రపంచ కప్ 2023 మొదటి మ్యాచ్‌కు అక్టోబర్ 5న ఆతిథ్యం ఇవ్వనున్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంపై దాడికి ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నాడు. నిజ్జర్ హత్యపై మేం మీ బుల్లెట్‌కు వ్యతిరేకంగా మా బ్యాలెట్‌ను ఉపయోగించబోతున్నామని, తాము మీ హింసకు వ్యతిరేకంగా ఓటు వేయనున్నామని చెప్పాడు. ఈ అక్టోబర్ 5న జరిగేది ప్రపంచ వరల్డ్ కప్ కాదని, ఇది ప్రపంచ టెర్రర్ కప్‌కు నాంది అన్నాడు. ఈ సందేశం గుర్‌పత్వంత్ సింగ్ పన్ను నుంచి వచ్చిందని ఆ రికార్డింగ్‌లో ఉంది.

అలాగే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను అగౌరవపరిచినందుకు భారత రాయబారి వర్మను హతమారుస్తామని అందులో హెచ్చరించాడు. వర్మను భారత్‌కు తీసుకురావడం, ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేయడం చాలా తెలివైన పని అన్నాడు.
Go Back to Shorts
khalistan
Punjab
Canada
India

More Telugu News