Chandrababu: చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

YSRCP leaders joins TDP in Giddaluru
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. చంద్రబాబు అరెస్ట్ అక్రమమంటూ టీడీపీ సహా విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ వైసీపీ శ్రేణులు కూడా ఆ పార్టీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ప్రకాశం జిల్లా గిద్దలూరులో టీడీపీలోకి పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు చేరారు. గిద్దలూరు జెడ్పీటీసీ సభ్యుడు బుడతా మధుసూదన్ యాదవ్ తో పాటు మరో ముగ్గురు సర్పంచ్ లు, ముగ్గురు మాజీ సర్పంచ్ లు, పలువురు ఉపసర్పంచ్ లు, వార్డు సభ్యులు, పలు గ్రామాల నాయకులు మూకుమ్మడిగా టీడీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జీ అశోక్ రెడ్డి సమక్షంలో వీరు తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో వైసీపీ నేతలు చేరడం ఆ పార్టీలో కలకలం రేపింది.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
YSRCP
Vijayasai Reddy

More Telugu News