క్రేజీ కాంబినేషన్.. సూర్యతో బోయపాటి సినిమా!

Boyapati Sreenu confirms his next project with Suriya
  • తెలుగు, తమిళ భాషల్లో రానున్న చిత్రం
  • ప్రస్తుతం ‘కంగువ’ చిత్రంలో నటిస్తున్న సూర్య
  •  ఈ నెల 28న విడుదల కానున్న బోయపాటి-రామ్ ‘స్కంద’
బాలయ్యతో ‘అఖండ’ చిత్రంతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తన తొలి ప్యాన్ ఇండియా చిత్రంగా పోతినేని రామ్ ప్రధాన పాత్రలో ‘స్కంద’ రూపొందించారు. ఈ సినిమా ఈనెల 28న ఐదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పుడు బోయపాటి తన తదుపరి చిత్రాన్ని తమిళ స్టార్ హీరో సూర్యతో చేయనున్నాడని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం గత కొంత కాలంగా చర్చలు జరుగుతున్నాయి. కోలీవుడ్ తాజా సమాచారం మేరకు బోయపాటి-సూర్య చిత్రం కన్ఫామ్ అయినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో సినిమా ప్రారంభం అవనుంది. దాంతో, తెలుగు, తమిళ భాషల్లో సరికొత్త కాంబినేషన్ అభిమానులను అలరించనుంది. 

బోయపాటి శ్రీను మాస్ మసాలా చిత్రాలకు ఫేమస్ కాగా.. సూర్య ఎలాంటి పాత్రలోనైనా మెప్పించగలడు. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. బోయపాటి గతంలో పలు ఇంటర్వ్యూలలో సూర్యతో కలిసి పనిచేయాలనే తన కోరికను ప్రస్తావించారు. సూర్య ప్రస్తుతం ‘కంగువ’ అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శివ రపొందిస్తున్నాడు. బాలీవుడ్ నటి దిశా పటాని కథానాయికగా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా 10 భాషల్లో విడుదల కానుంది.
Advertisement
Tollywood
Kollywood
surya
Boyapati Sreenu

More Telugu News