జీ20 సందర్భంగా ప్రెసిడెన్షియల్ సూట్ నిరాకరించిన కెనడా ప్రధాని ట్రూడూ.. భారత్‌పై ముందు నుంచి వ్యతిరేకతేనా?
- ఢిల్లీలో రెండ్రోజుల పాటు జరిగిన జీటీ20 సదస్సు
- అన్ని దేశాల ప్రతినిధులకు భారీ భద్రతతో హోటళ్లలో ప్రత్యేక సదుపాయాలు
- ప్రెసిడెన్షియల్ సూట్ వద్దని సాధారణ గదిలో ఉన్న ట్రూడూ
ఈ క్రమంలో కెనడా ప్రధాని ట్రూడూకు కూడా ఢిల్లీలోని లలిత్ హోటల్‌లో ప్రత్యేకంగా రూపొందించిన ప్రెసిడెన్షియల్ సూట్‌లో బస ఏర్పాటు చేసింది. కానీ, ఇందులో ఉండటానికి ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడూ నిరాకరించారు. దాంతో, ఆయన భద్రత విషయంలో భారత ఇంటెలిజెన్స్ అధికారులలో ఆందోళనలు నెలకొన్నాయని కేంద్ర వర్గాలు తెలిపాయి. తన కోసం బుక్ చేసిన ప్రత్యేక ప్రెసిడెన్షియల్ సూట్ ను ట్రూడూ ఒక్క రోజు కూడా ఉపయోగించలేదు. బదులుగా మన దేశంలో ఉన్నంతసేపు ఆయన హోటల్‌లోని సాధారణ గదిలో బస చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.