తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రకటించిన 6 ప్రధాన హామీలు ఇవే!
- మరో రెండు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
- హైదరాబాద్ తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరి సభ
- 6 హామీలను ప్రకటించిన సోనియా, ఖర్గే, రాహుల్ గాంధీ
1. మహాలక్ష్మి పథకం: మహిళలకు ప్రతి నెల రూ.2,500 చెల్లిస్తారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం.
2. రైతు భరోసా: రైతులకు, కౌలు రౌతులకు ప్రతి ఏడాది రూ.15 వేలు. వ్యవసాయ కూలీలకు ప్రతి ఏడాది రూ.12 వేలు. వరిపంటకు క్వింటాల్ పై రూ.500 బోనస్.
3. గృహజ్యోతి: నివాస గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు.
4. ఇందిరమ్మ ఇళ్లు: ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు. ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు. తెలంగాణ కోసం పోరాడిన యోధులకు 250 చదరపు గజాల స్థలం.
5. యువ వికాసం: తెలంగాణలోని విద్యార్థులకు రూ.5 లక్షల విలువ చేసే విద్యా భరోసా కార్డు. ప్రతి మండలంలోనూ ఇంటర్నేషనల్ స్కూళ్లు.
6. చేయూత: అర్హులైన వారికి నెలకు రూ.4 వేల చొప్పున పెన్షను. రూ.10 లక్షల మేర రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా సదుపాయం.
