Samantha: సమంత నాకు తల్లి లాంటిది: అసిస్టెంట్ ఆర్యన్

Samantha assistant Aryan talks about his owner
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ నటి సమంత సామాజిక స్పృహ, మానవతా దృక్పథం మెండుగా ఉన్న వ్యక్తి. అభాగ్యులకు ఆమె అండగా నిలిచిన సందర్భాలెన్నో ఉన్నాయి. తాజాగా సమంత మంచి మనసు గురించి ఆమె ఆసిస్టెంట్ ఆర్యన్ ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. తన వరకు సమంత తల్లి వంటిదని అభివర్ణించాడు. 

గుంటూరు నుంచి తాను ఉపాధి కోసం ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ వచ్చానని వెల్లడించాడు. మొదట్లో అనేక పనులు చేశానని, ఆ తర్వాత స్నేహితుల చలవతో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టానని వెల్లడించాడు. కొందరు నటుల వద్ద అసిస్టెంట్ గా పనిచేశానని, ఆ తర్వాత సమంత వద్ద చేరానని ఆర్యన్ తెలిపాడు. 

దూకుడు సినిమా సమయంలో కొత్త బైక్ కొన్నానని, అది టీవీఎస్ అపాచీ బైక్ అని, ఆ బైక్ కొనడానికి సమంత మేడమ్ హెల్ప్ చేశారని వివరించాడు. ఇంట్లోంచి వచ్చిన ఆరేళ్ల తర్వాత ఆ బైక్ పై గుంటూరు వచ్చానని ఆర్యన్ తెలిపాడు. అదే బైక్ పై సమంత మేడమ్ కూడా తనతో ప్రయాణించారని, ఆమె తనకు ఎల్జీ ఫోన్ కొనుక్కునేందుకు కూడా సాయపడ్డారని వెల్లడించాడు. 

అంతేకాదు, మణికొండలో తాను 3 బీహెచ్ కే ఇల్లు కొనుక్కోవడానికి సమంత తోడ్పాటు అందించారని వివరించాడు. తన జీవితంలో దేవుడు గురించి మాట్లాడాల్సి వస్తే, అది సమంత మేడమ్ గురించేనని ఆర్యన్ పేర్కొన్నాడు. 

"నాకు కొడుకు పుడితే, 'జాను' సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉండి కూడా నా కొడుకును చూడ్డానికి సమంత వచ్చారు. నా బిడ్డను ఎత్తుకుని ఆమె ముద్దాడారు... మేడమ్ కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధమే" అని ఆర్యన్ భావోద్వేగాలతో చెప్పాడు.
Go Back to Shorts
Samantha
Aryan
Assistant
Tollywood

More Telugu News