కాంగ్రెస్ లో తుమ్మల చేరికకు ముహూర్తం ఫిక్స్
- ఆసక్తిని రేకెత్తిస్తున్న ఖమ్మం జిల్లా రాజకీయాలు
- తుమ్మలను కలిసిన మల్లు భట్టి విక్రమార్క
- ఈ నెల 6న రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న తుమ్మల
మరోవైపు తుమ్మల నివాసానికి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. తన అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని ఈ సందర్భంగా భట్టికి తుమ్మల చెప్పారు. ఇంకోవైపు నిన్న తుమ్మల నివాసానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెళ్లారు. ఇటీవల ఆయనను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా కలిశారు. కాంగ్రెస్ కీలక నేతలంతా ఆయనను కలిసి పార్టీలోకి స్వాగతిస్తున్నారు.