రామ్ నాకు సవాల్ విసురుతున్నాడు: 'స్కంద' ఈవెంటులో బాలయ్య

Skanda movie pre release event
  • 'స్కంద' ఈవెంటుకి ముఖ్య అతిథిగా వచ్చిన బాలయ్య 
  • బోయపాటి అంకిత భావం పట్ల ప్రశంసలు 
  • రామ్ తపన గురించిన ప్రస్తావన 
  • శ్రీలీల ఎప్పుడూ హుషారుగానే ఉంటుందంటూ వ్యాఖ్య

రామ్ - శ్రీలీల జంటగా బోయపాటి రూపొందించిన 'స్కంద' సినిమా, బాలయ్య ముఖ్య అతిథిగా హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంటును జరుపుకుంది. ఈ వేదికపై బాలయ్య మాట్లాడుతూ .. " నటుడిగా రామ్ జర్నీని నేను చూస్తూనే ఉన్నాను. ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించడానికి ట్రై చేస్తూ వస్తున్నాడు. తెలంగాణ నేపథ్యంలో ఆయన ఈ సినిమా చేసి, 'భగవంత్ కేసరి'లో నా పాత్రపై సవాల్ విసురుతున్నాడు" అని అన్నారు. 

ఇక శ్రీలీల విషయానికి వస్తే .. అందం .. అభినయం .. నాట్యం అన్నీ తెలిసిన అమ్మాయి. నేను తనతో చేస్తున్నాను. వరుసగా ఎన్నో సినిమాలు చేస్తున్నా, తనలో అలసటను నేను చూడలేదు. ఎప్పుడు చూసినా ఎంతో హుషారుగా ఉంటుంది. తనకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు. 

" బోయపాటి అంకితభావాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఇద్దరం కూడా గతంలో చేసిన సినిమాల గురించి కాకుండా చేయబోయే సినిమాలను గురించి ఆలోచన చేస్తూ ఉంటాము. ఈ సినిమాతో ఆయన మరో హిట్ ను ఇవ్వడం ఖాయమనే నాకు అనిపిస్తోంది" అంటూ చెప్పుకొచ్చారు. 

Advertisement
Skanda
Ram
Sreeleela
Boyapati Sreenu
Balakrishna

More Telugu News