Rafael Nadal: ఇన్ఫోసిస్ బ్రాండ్ అంబాసిడర్ గా టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్

Rafael Nadal join hands with Infosys
షార్ట్స్‌లో చూడండి
స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తో చేయి కలిపాడు. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ సేవలు అందిస్తున్న ఇన్ఫోసిస్ కు నాదల్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమితుడయ్యాడు. ఇన్ఫోసిస్ కు మూడేళ్ల పాటు ప్రచారకర్తగా వ్యవహరించేందుకు నాదల్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇన్ఫోసిస్ సంస్థ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ)కి 2015 నుంచి టెక్నాలజీ పార్టనర్ గా కొనసాగుతోంది.

ఓ సాఫ్ట్ వేర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం నాదల్ కు ఇదే ప్రథమం. ఈ ఒప్పందంలో భాగంగా ఇన్ఫోసిస్, నాదల్ కోచింగ్ టీమ్ కృత్రిమ మేథతో కూడిన మ్యాచ్ అనాలిసిస్ టూల్ ను కూడా అభివృద్ధి చేయనున్నారు. 

దీనిపై నాదల్ స్పందించాడు. ఇన్ఫోసిస్ తో కలవడం ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించాడు. ఇప్పుడు తాను ఇన్ఫోసిస్ గ్లోబల్ అంబాసిడర్ నని తెలిపాడు. తమ భాగస్వామ్యం ఎంతో ఆహ్లాదకరంగా ముందుకు సాగుతుందని భావిస్తున్నానని నాదల్ పేర్కొన్నాడు.
Go Back to Shorts
Rafael Nadal
Infosys
Brand Ambassador
Tennis
Spain
India

More Telugu News