ఛార్జింగ్ విషయంలో ఐఫోన్ యూజర్లకు యాపిల్ కీలక హెచ్చరికలు
- ఛార్జింగ్ పెట్టిన ఫోన్ పక్కన నిద్రించవద్దని హెచ్చరించిన సంస్థ
- దుప్పట్లు, దిండ్లపైనా ఛార్జింగ్ పెట్టిన ఫోన్ ను ఉంచొద్దని సూచన
- దెబ్బతిన్న కేబుల్స్, ఛార్జర్లను వాడొద్దన్న కంపెనీ
దుప్పట్లు, దిండ్లు, శరీరం వంటి మృదువైన ఉపరితలాలపై ఛార్జింగ్ పెట్టవద్దని స్పష్టం చేసింది. ఛార్జింగ్ ప్రక్రియలో ఐఫోన్లు కొంత వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఈ వేడిని సులభంగా విడుదల చేయలేనప్పుడు ఫోన్ కొంద ఉన్న భాగం కాలిపోవడం, తీవ్రమైన సందర్భాల్లో మంటలను రేకెత్తించే ప్రమాదం కలిగిస్తాయని తెలిపింది. ఫోన్ ను ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఆ పరికరం, పవర్ అడాప్టర్, వైర్‌లెస్ ఛార్జర్‌పై నిద్రించవద్దని సూచించింది. వాటిని పవర్ సోర్స్‌కి కనెక్ట్ చేసినప్పుడు దుప్పటి, దిండు, శరీరం కింద ఉంచవద్దని స్పష్టం చేసింది. దెబ్బతిన్న కేబుల్స్, ఛార్జర్లను ఉపయోగించవద్దని, తేమ ఉన్నప్పుడు ఛార్జింగ్ చేయకూడదని కూడా సలహా ఇచ్చింది.