నేడు, రేపు తెలంగాణలోని పలుచోట్ల భారీ వర్షాలు
- శుక్ర, శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు
- బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం
- రెండు రోజుల పాటు ఎల్లో హెచ్చరికల జారీ
ఈ రోజు ఆదిలాబాద్, కొమురం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెంలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రేపు ఆదిలాబాద్, కుమురం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వెల్లడించింది. ఈ రెండు రోజుల పాటు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.