వారిని హేళన చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం: పవన్ కల్యాణ్
- విశాఖ జనవాణి కార్యక్రమంలో దివ్యాంగులతో పవన్ భేటీ
- వారిలో అపరమితమైన ప్రతిభ దాగి ఉందన్న జనసేనాని
- ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పిస్తే ఉన్నతస్థాయికి వెళ్తారని వ్యాఖ్య
- జనసేన ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులను గుండెల్లో పెట్టుకుంటామన్న పవన్
జనసేన ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులను గుండెల్లో పెట్టి చూసుకుంటామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగే దుస్థితిని దూరం చేస్తామన్నారు. దివ్యాంగుల పట్ల సమాజం చిన్నచూపు చూస్తోందని, ప్రభుత్వాలు కూడా వివక్ష చూపిస్తున్నాయన్నారు. అంగవైకల్యం కంటికి కనిపిస్తున్నా సర్టిఫికెట్ ఇవ్వరు.. పెన్షన్ ఇవ్వరని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని దివ్యాంగులందరికీ పెన్షన్ ఇవ్వడం లేదన్నారు.