మళ్లీ ఇంతకాలానికి విజయ్ మూవీలో జ్యోతిక!
Add ap7am to your home Screen

మళ్లీ ఇంతకాలానికి విజయ్ మూవీలో జ్యోతిక!

Jyothika in Vijay movie
  • 'లియో' షూటింగులో బిజీగా విజయ్ 
  • ఆ తరువాత సినిమా వెంకట్ ప్రభుతో
  • జ్యోతికను ఎంపిక చేసినట్టుగా టాక్ 
  • గతంలో రెండు భారీ హిట్లు కొట్టిన జోడీ ఇది    
ఓ 20 ఏళ్ల క్రితం స్టార్ హీరోయిన్ గా జ్యోతిక ఒక ఊపు ఊపేసింది. ఎక్కువగా తమిళంలో స్టార్ హీరోల సరసన సందడి చేసిన జ్యోతిక, తెలుగులో 'ఠాగూర్' .. 'బాస్' .. 'విక్రమార్కుడు' వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించింది. ఇక తమిళంలో ఆమె చేసిన 'చంద్రముఖి'ని తెలుగు సినిమాగానే ప్రేక్షకులు భావించారు. 

సూర్యతో వివాహమైన తరువాత జ్యోతిక సినిమాలను పక్కన పెట్టేసింది. ఈ మధ్యనే రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె, తనకి నచ్చిన పాత్రలను చేస్తూ వెళుతోంది. ఈ నేపథ్యంలోనే విజయ్ సినిమాలో ఆమె ఒక ముఖ్యమైన పాత్రను చేయనున్నట్టుగా తెలుస్తోంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించే సినిమా ఇది.

గతంలో విజయ్ జోడీగా జ్యోతిక 'ఖుషి' సినిమా చేసింది. ఆ తరువాత ఆయన సరసన 'తిరుమలై' చేసింది. ఈ రెండూ కూడా సూపర్ హిట్ సినిమాలే. మళ్లీ ఇంతకాలానికి ఆమె విజయ్ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం విజయ్ చేస్తున్న 'లియో' పూర్తికాగానే, ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. 

Advertisement
Jyothika
Vijay
Venkat Prabhu

More Telugu News