ఇన్నాళ్లూ చిరంజీవిని పెద్దమనిషిగా భావించాం!: రోజా
- చిరంజీవికి సడన్‌గా ఏమైందో కానీ విషం చిమ్ముతున్నారన్న రోజా
- పవన్, బాబు, లోకేశ్ ఏపీలో ఇల్లు కట్టుకొని ఉంటామని చెప్పారా అని ప్రశ్న
- జగన్ తండ్రి ఆశయాలను ముందుకు నడిపిస్తున్నారని వ్యాఖ్య
కానీ జగన్ ఎమ్మెల్యేగా ఇడుపులపాయలో ఇల్లు నిర్మించుకొని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నారని, ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారన్నారు. జగన్ తన తండ్రి ఆశయాలను ముందుకు నడిపించే ఉద్ధేశ్యంతో ముందుకు సాగారని, ఎన్ని కష్టాలు, అవమానాలు, నిందలు వచ్చినా భరించారన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను చూసి వాటిని తీరుస్తానని భరోసా ఇచ్చారని, ఇప్పుడు అందుకు అనుగుణంగా పని చేస్తున్నారన్నారు.