వాలంటీర్ చేతిలో హత్యకు గురైన మహిళ కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కల్యాణ్... ఫొటోలు ఇవిగో!
Add ap7am to your home Screen

వాలంటీర్ చేతిలో హత్యకు గురైన మహిళ కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కల్యాణ్... ఫొటోలు ఇవిగో!

Pawan Kalyan visits women family in Pendurti constituency
  • గత నెలలో విశాఖ జిల్లాలో వాలంటీర్ ఘాతుకం
  • నగల చోరీ కోసం వరలక్ష్మి అనే వృద్ధురాలి హత్య
  • నేడు సుజాత నగర్ విచ్చేసిన పవన్
  • మహిళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పిన వైనం
విశాఖ జిల్లా పెందుర్తిలో కోటగిరి వరలక్ష్మి అనే వృద్ధురాలు వాలంటీర్ వెంకట్ చేతిలో గత నెలలో హత్యకు గురికావడం తెలిసిందే. బంగారు నగల కోసం ఆ వాలంటీర్ వృద్ధురాలిని హత్య చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో, వరలక్ష్మి కుటుంబ సభ్యులను జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేడు పరామర్శించారు. పెందుర్తి నియోజకవర్గంలోని సుజాత నగర్ లో ఉన్న వరలక్ష్మి నివాసానికి పవన్ వెళ్లారు. అక్కడ వరలక్ష్మి చిత్ర పటానికి నివాళులు అర్పించారు. విషాదంలో ఉన్న ఆ వృద్ధురాలి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ పర్యటనలో పవన్ వెంట జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. 
Advertisement
Pawan Kalyan
Varalakshmi
Volunteer
Murder
Pendurti
Visakhapatnam

More Telugu News