ఇంటర్ విద్యార్థిని డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి
- కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసిన దారుణం
- స్థానిక కళాశాలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థినికి చిన్నతనం నుంచే గుండెలో రంధ్రం
- శుక్రవారం ఫ్రెషర్ డే సందర్భంగా డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిన వైనం
- బాలికను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్ల ప్రకటన
కాగా, శుక్రవారం కళాశాలలో ఫ్రెషర్స్ డే నిర్వహించారు. ఈ క్రమంలో ప్రదీప్తి తోటి విద్యార్థినులతో కలిసి డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. కళాశాలలోని లెక్చరర్లు ఆమెకు సీపీఆర్ చేసినా ప్రయోజనం లేకపోవడంతో వెంటనే కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. కన్నబిడ్డను కోల్పోయినందుకు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.