తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. ఈటలను ఆలింగనం చేసుకున్న కేటీఆర్!
- ఈరోజు ప్రారంభమైన తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు
- బీజేపీ ఎమ్మెల్యే ఈటల సీటు వద్దకు మంత్రి కేటీఆర్
- ఆప్యాయంగా పలకరింపు.. ఆలింగనం
- పదినిమిషాల పాటు మాట్లాడుకున్న నేతలు!
మరోవైపు మంత్రి కేటీఆర్‌ను కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలిశారు. కేటీఆర్ చాంబర్‌లో ఈ మేరకు ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్, జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. టీషర్ట్‌తో వచ్చిన జగ్గారెడ్డిని ‘పిల్లలతో కలిసి తిరిగితే ఎలా?’ అంటూ కేటీఆర్ సరదాగా అడిగారు. బదులిచ్చిన జగ్గారెడ్డి.. ‘టీషర్ట్ తో వస్తే పిల్లలవుతారా?’ అంటూ నవ్వుతూ ప్రశ్నించారు. జగ్గారెడ్డితో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ఉండటంతో.. ‘మీ దోస్తాన్ ఎక్కడ కుదిరింది?’ అని కేటీఆర్ అడిగారు. ‘తమది ఒక మంచం.. ఒకే కంచం’ అని మామిళ్ల రాజేందర్ చెప్పారు. ఈటల, జగ్గారెడ్డితో కేటీఆర్ సంభాషణ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది.