చెప్పాల్సిన అవసరం లేదు!: అంబటి రాంబాబు వ్యాఖ్యలపై బ్రో సినిమా నిర్మాత స్పందన
- విదేశాల నుండి వచ్చే డబ్బులకు ఆర్బీఐ రూల్స్ ఉంటాయన్న విశ్వప్రసాద్
- పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ చెప్పాల్సిన అవసరం లేదని వెల్లడి
- శ్యాంబాబు క్యారెక్టర్ నెగిటివ్‌గా అనిపించలేదన్న నిర్మాత
పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్, ఈ సినిమాకు అయిన ఖర్చును చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఓటీటీలో తమకు మంచి బిజినెస్ ఉందని, తాము ప్రొడక్షన్ లోకి వచ్చి అయిదేళ్లవుతోందన్నారు. అంబటి చెబుతున్న శ్యాంబాబు క్యారెక్టర్‌తో ఆయనకు సంబంధం లేదన్నారు. ఇందులో డ్రెస్ ఒకటే మ్యాచ్ అయిందని, అయినప్పటికీ శ్యాంబాబు క్యారెక్టర్ తమకు నెగిటివ్‌గా అనిపించలేదని తెలిపారు. క్రియేటివ్‌గా ఉంటుందనే బ్రో సినిమాలో ఆ క్యారెక్టర్ పెట్టినట్లు చెప్పారు.