సీఎం స్టాలిన్ పెద్ద అన్నయ్యకు తీవ్ర అస్వస్థత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీఎం స్టాలిన్ పెద్ద అన్నయ్యకు తీవ్ర అస్వస్థత

CM Stalin brother Muthu admitted in hospital
  • కరుణానిధి పెద్ద భార్య కుమారుడు ముత్తుకు అస్వస్థత
  • ఆళ్వార్ పేటలో ఉన్న కావేరి ఆసుపత్రిలో చికిత్స
  • వయసు సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్న ముత్తు
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పెద్ద అన్నయ్య, దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే ముత్తు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చెన్నై ఆళ్వార్ పేటలో ఉన్న కావేరి ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. 

కరుణానిధికి, ఆయన పెద్ద భార్య పద్మావతికి ముత్తు జన్మించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. పూకారి, సమయల్ కారన్, అనయా విళక్కు, నంబికై నచ్చత్రం, పిల్లయో పిల్లయ్ తదితర చిత్రాల్లో ముత్తు హీరోగా నటించారు. ముత్తుకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వయసు సంబంధిత అనారోగ్యంతో ముత్తు బాధపడుతున్నారు.
Advertisement
Stalin
Brother
Muthu
ILL

More Telugu News