హీరోగా ఎంఎస్ ధోనీ.. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా అంటున్న భార్య సాక్షి
- సినిమా నిర్మాణ రంగంలోకి వచ్చిన ధోనీ దంపతులు
- తొలి సినిమాగా ఎల్‌జీఎం నిర్మాణం
- ప్రమోషన్స్‌లో బిజీగా సాక్షి ధోనీ
‘మా పెళ్లికి ఒక్క రోజు ముందే మా అత్తగారిని కలిశా. మేమిద్దరం చాలా స్నేహంగా ఉంటాం. ఆమె నన్ను చాలా సపోర్ట్ చేస్తుంది. ఎంతో సరదాగా ఉంటుంది. ఇంట్లో మా మావయ్యే చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అందుకే ధోనీలో అంత క్రమశిక్షణ ఉంది’ అని తెలిపారు. ఇక ధోనీని హీరోగా చూడొచ్చా అన్న ప్రశ్నకు సాక్షి సమాధానం చెప్పారు.
‘ఆయన హీరోగా సినిమాల్లోకి వస్తే బాగానే ఉంటుంది. రావాలని నేను కోరుకుంటున్నా. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా. అది నిజమైతే నా జీవితంలో సంతోషకరమైన రోజు అవుతుంది’ అని చెప్పుకొచ్చారు. తెలుగులో ప్రభాస్, రామ్ చరణ్ లాంటి బడా హీరోలతో సినిమా తీయాలంటే వారికి భారీ పారితోషికం ఇవ్వాల్సి ఉంటుందని, అంత బడ్జెట్ తమ దగ్గర లేదన్నారు. తమ కంపెనీని ఇప్పుడే మొదలు పెట్టి నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.