ఆయన విడాకులు తీసుకుని పెళ్లి చేసుకుంటే మీకు ఏం సమస్య?: జగన్ పై సీపీఐ నారాయణ ఫైర్
- జగన్ ఎప్పుడూ పవన్ పెళ్లిళ్ల గురించే మాట్లాడుతున్నారని నారాయణ విమర్శ
- మూడు పెళ్లిళ్లు తప్పా? లేక బాబాయ్ ని హత్య చేయడం తప్పా? అని ప్రశ్న
- సీఎం హోదాను మర్చిపోయి దిగజారి మాట్లాడుతున్నారని మండిపాటు
జగన్ తన సీఎం హోదాను మర్చిపోయి దిగజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాజకీయ పరంగా ఎవరినైనా విమర్శించవచ్చని... తరచూ వ్యక్తిగత దూషణలు చేయడం, నిందలు వేయడం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయంగా విమర్శించేందుకు ఏమీ లేకపోవడం వల్లే జగన్ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని విమర్శించారు.