'మై డియర్ బ్రదర్ తారక్' అంటూ కేటీఆర్ కు చిరంజీవి శుభాకాంక్షలు
- ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్న కేటీఆర్
- మీరు ఒక డైనమిక్ లీడర్ అంటూ చిరంజీవి ప్రశంస
- స్ఫూర్తినిచ్చే మీ కలలు నిజమవ్వాలని ట్వీట్
'మై డియర్ బ్రదర్ తారక్... మీరు ఒక డైనమిక్ లీడర్. మేమంతా ఎంతో ప్రేమించే, ఆరాధించే స్నేహితుడు. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. స్ఫూర్తినిచ్చే మీ కలలు నిజమవ్వాలి. మీ ప్రయాణంలో మీరు వేసే ప్రతి అడుగుకు ఆశీర్వాదాలు ఉంటాయి. హ్యాపీ బర్త్ డే' అని చిరంజీవి ట్వీట్ చేశారు.