Kottu Sathyarayana: పవన్ కల్యాణ్ గ్రాఫ్ ను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోంది: ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను పతనం దిశగా నడిపించేందుకు ఓ పథకం ప్రకారం కుట్ర జరుగుతోందని ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ ను పర్మినెంటుగా రాజకీయాలకు దూరం చేసేందుకు ఆయనతో లేనిపోని వ్యాఖ్యలు చేయిస్తున్నారని తెలిపారు. నోటికొచ్చిన వ్యాఖ్యలు చేయడం ద్వారా పవన్ కల్యాణ్ గ్రాఫ్ దారుణంగా పడిపోతోందని వివరించారు. కుట్ర జరుగుతున్న విషయాన్ని పవన్ గ్రహించలేకపోతున్నాడని అన్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ మూతపడేవరకు చంద్రబాబు విశ్రమించలేదని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు.