శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయం
Add ap7am to your home Screen

శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయం

Pawan Kalyan decides to complain against Srikalahasti CI Anju Yadav
  • వివాదాస్పద సీఐగా గుర్తింపు తెచ్చుకున్న అంజూ యాదవ్
  • ఇటీవల శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తల ధర్నా
  • జనసేన నేత సాయి చెంప చెళ్లుమనిపించిన సీఐ అంజూ యాదవ్
  • ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న పవన్ కల్యాణ్
  • సోమవారం నాడు తిరుపతి రానున్న జనసేనాని
తన చర్యలతో పలుమార్లు వివాదాస్పదమైన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ ఇటీవల జనసేన నేత సాయి చెంప చెళ్లుమనిపించడం తెలిసిందే. ఈ విషయాన్ని జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. పవన్ సోమవారం నాడు తిరుపతి రానున్నారు. 

ఈ సందర్భంగా శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ వ్యవహారంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. సీఐ అంజూ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేయనున్నారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించనున్నారు.

పవన్ పై వైసీపీ నేతల వ్యాఖ్యలను నిరసిస్తూ కొన్నిరోజుల కిందట శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తలు పెళ్లిమండపం జంక్షన్ లో ధర్నాకు దిగారు. జనసేన కార్యకర్తలు సీఎం జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగానే జనసేన నేత సాయిపై సీఐ అంజూ యాదవ్ చేయి చేసుకున్నారు.
Advertisement
Pawan Kalyan
Anju Yadav
CI
Srikalahasti
Janasena
Tirupati district

More Telugu News