మూడ్రోజుల్లోనే ముగించిన భారత్.. చిత్తుగా ఓడిన వెస్టిండీస్
- తొలి టెస్టులో భారత్ ఘన విజయం
- ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలుపు
- యశస్వి జైస్వాల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు
దాంతో, భారత్ కు 271 పరుగుల ఆధిక్యం సాధించింది. భారీ లోటు స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కరీబియన్ జట్టు 130 పరుగులకే ఆలౌటైంది. అలిక్ అతాజనే (28) టాప్ స్కోరర్. రవిచంద్రన్ అశ్విన్ ఏడు వికెట్లతో విండీస్‌ను దెబ్బకొట్టాడు. జడేజా రెండు వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ తీశాడు. అరంగేట్రం టెస్టులోనే భారీ సెంచరీ చేసిన యశస్వికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ లో భారత్ 1–0తో ఆధిక్యం సాధించింది. రెండో టెస్టు ఈ నెల 20న ప్రారంభం అవుతుంది.