తనకు క్యాన్సర్ అంటూ జరుగుతున్న ప్రచారంపై కొడాలి నాని స్పందన

Kodali Nani reacts to speculations
  • టీడీపీ నేతలు దిగజారిపోయారన్న కొడాలి నాని
  • తనకు ఎలాంటి క్యాన్సర్ లేదని స్పష్టీకరణ
  • చంద్రబాబును పాలిటిక్స్ నుంచి  పంపే వరకు భూమ్మీద ఉంటానని వెల్లడి
  • ఇలాంటి ప్రచారాలు చేసేది ఐ-టీడీపీ అని ఆరోపణ
వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని తన ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారం పట్ల స్పందించారు. తాను క్యాన్సర్ తో హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చేరారంటూ వస్తున్న కథనాల్లో నిజంలేదని స్పష్టం చేశారు. కొందరు కావాలనే దురుద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

ఇది టీడీపీ నేతల పనే అని కొడాలి నాని ఆరోపించారు. ఈ స్థాయికి దిగజారేది టీడీపీ నేతలే అని విమర్శించారు. తనకు ఎలాంటి క్యాన్సర్ లేదని, టీడీపీ నేతలు ఐ-టీడీపీ ద్వారా ఇలాంటి ప్రచారాలు చేయిస్తున్నారని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చంద్రబాబును పాలిటిక్స్ నుంచి, ఏపీ నుంచి పంపించే వరకు తాను భూమ్మీద ఉంటానని స్పష్టం చేశారు. తనకు క్యాన్సర్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని సూచించారు. ఇలాంటి ప్రచారాలు ఎన్ని చేసుకున్నా తనకేం కాదని ధీమా వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Kodali Nani
Cancer
Rumors
YSRCP
TDP
Gudivada

More Telugu News