అంబటి రాంబాబుకు షాక్.. టీడీపీలో చేరిన ప్రధాన అనుచరుడు
- టీడీపీలో చేరిన సత్తెనపల్లి వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు బత్తుల ఆదినారాయణ
- ఉమ్మడి గుంటూరు జిల్లా కాపునాడు అధ్యక్షుడిగా కూడా పని చేసిన బత్తుల
- పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన కన్నా లక్ష్మీనారాయణ
ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... ఆదినారాయణ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారని చెప్పారు. ఆయనను టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించామని తెలిపారు. అందరినీ కలవగలిగిన, కలపగలిగిన ప్రముఖ న్యాయవాది, కాపు సంఘం అధ్యక్షుడు ఆదినారాయణను టీడీపీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరినందుకు వారిని తాను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాని చెప్పారు. రాష్ట్రానికి వైసీపీ రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించడానికి, టీడీపీ అధికారంలోకి రావడానికి ప్రజలతో పాటు, మేదావులు అందరం కలిసి పని చేద్దామని చెప్పారు.
