హైదరాబాద్‌లో బాలిక కిడ్నాప్ కలకలం!
- మేడ్చల్లో ఇంటి ముందు ఆడుకుంటూ అకస్మాత్తుగా కనిపించకుండా పోయిన బాలిక
- పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు
- బాలికను కిడ్నాప్ చేశారేమోనని ఆందోళన
- సీసీటీవీ ఫుటేజీతో బాలిక కోసం పోలీసుల గాలింపు
మరోపక్క, నిన్న పెద్ద అంబర్ పేట్ హైవే చెక్ పోస్ట్ వద్ద వెలుగు చూసిన బాలిక కిడ్నాప్ ఉదంతం నగర వాసులను ఉలిక్కిపడేలా చేసింది. బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేయగా వారి నుంచి కష్టపడి తప్పించుకున్న బాలిక వీధిలో నిలబడి వచ్చిపోయే వారి సాయం కోసం అర్థించింది. బాలిక దుస్థితి చూసినా ఒక్కరూ స్పందించకపోవడంతో చలించిపోయిన ఓ హిజ్రా చేయూతనందించాడు. హిజ్రా వద్ద ఫోన్ తీసుకున్న బాలిక తన అన్నకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. దీంతో, బాలిక కుటుంబసభ్యులు, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. నిందితుల నుంచి తప్పించుకునే క్రమంలో గాయాలపాలైన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు.