భారతీయుడిపై ప్రేమ.. పిల్లల్ని తీసుకుని ఇండియాకు వచ్చేసిన పాకిస్థానీ వివాహిత
- ఆన్‌లైన్‌లో పబ్‌జీ గేమ్ ఆడే క్రమంలో ఉత్తరప్రదేశ్ వ్యక్తితో పరిచయం
- పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ప్రియుడితో కలిసుండాలని కోరుకున్న పాకిస్థానీ మహిళ
- నేపాల్ మీదుగా ఇండియాలో కాలుపెట్టిన వైనం
- గ్రేటర్ నోయిడాలో ప్రియుడితో కలిసి కాపురం
- తాజాగా వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు
గత నెలలో ఉత్తరప్రదేశ్ చేరుకున్న ఆమె అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రియుడి చెంతకు చేరుకుందని చెప్పారు. స్థానికంగా ఓ అద్దె అపార్టుమెంటులో నివసించడం ప్రారంభించారు. ఈ ఉదంతం తాలూకు సమాచారం పోలీసులకు చేరడంతో వారు ఆ కుటుంబాన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా, మహిళను చూస్తే పాకిస్థాన్ నుంచి వచ్చినట్టు అస్సలు అనుమానం కలగలేదని ఇంటి ఓనర్ చెప్పడం గమనార్హం.