Andhra Pradesh: ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయి: ఐఎండీ
భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) ఏపీకి వర్ష సూచన జారీ చేసింది. ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. అదే సమయంలో మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
దేశంలోని ఇతర భాగాలకు నైరుతి రుతుపవనాలు మరింత విస్తరిస్తున్నాయని, అదే సమయంలో వాయవ్య ఉత్తరప్రదేశ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఐఎండీ వెల్లడించింది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంపై కూడా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వివరించింది.