Swathi Reddy: ప్రవాసాంధ్రురాలు స్వాతిరెడ్డి పోరాటానికి చంద్రబాబు మద్దతు

TDP Chief Chandrababu Called Swathi Reddy
షార్ట్స్‌లో చూడండి
ప్రవాసాంధ్రురాలు స్వాతిరెడ్డి పోరాటానికి చంద్రబాబు మద్దతు ప్రకటించారు. ఆమెకు ఫోన్ చేసి మాట్లాడిన టీడీపీ అధినేత.. ఆమెపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. స్వాతిరెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా దుష్ప్రచారం చేస్తున్న వారిపై ఆమె చేస్తున్న పోరాటానికి తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగించేలా వైసీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అసత్యాలు, దుష్ప్రచారం చేస్తూ భయపెట్టాలన్న వైసీపీ వ్యూహాలు స్వాతిరెడ్డి వంటి వ్యక్తుల సంకల్పాన్ని దెబ్బతీయలేవని, ఆమెకు అండగా ఉంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.
Go Back to Shorts
Swathi Reddy
Telugudesam
Chandrababu
YCP Social Media

More Telugu News