'స్పై' మీ ఊహకు మించి ఉంటుంది .. ఇక టికెట్స్ బుక్ చేసుకోండి: నిఖిల్

Spy Pre Release Event
  • నిఖిల్ హీరోగా రూపొందిన 'స్పై'
  • నేతాజీ డెత్ మిస్టరీ నేపథ్యంలో సాగే కథ 
  • దర్శకత్వం వహించిన గ్యారీ బీహెచ్ 
  • ఈ నెల 29వ తేదీన విడుదల  

నిఖిల్ హీరోగా గ్యారీ బీహెచ్ 'స్పై' సినిమాను రూపొందించాడు. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ఐశ్వర్య మీనన్ .. సన్యా ఠాకూర్ కథానాయికలుగా పరిచయమవుతున్నారు. ఈ నేపథ్యంలో నాగచైతన్య చీఫ్ గెస్టుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాదులో నిర్వహించారు.

ఈ వేదికపై నిఖిల్ మాట్లాడుతూ .. "నేను 'కార్తికేయ 2' సినిమా చేయడానికి ముందు నిర్మాత రాజశేఖర్ గారు నాతో ఈ సినిమా చేయానికి సిద్ధపడ్డారు. నాపై ఆయన ఉంచిన నమ్మకానికి నేను థ్యాంక్స్ చెబుతున్నాను. ఇది ఒక మంచి సినిమా అని నేను బలంగా చెప్పగలను. సినిమా చూసిన తరువాత మీరంతా కూడా ఇదే మాట చెబుతారు" అని అన్నాడు. 

" ఈ సినిమా ఫస్టాఫ్ ఫెంటాస్టిక్ గా ఉంటుంది .. సెకండాఫ్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. నేతాజీ గురించి విన్నప్పుడు మాకు కలిగిన అనుభూతి మీకూ కలుగుతుంది. ఇక మీరు టికెట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఆశించినదానికంటే .. మీరు ఊహించినదానికంటే ఎక్కువగానే ఈ సినిమా కంటెంట్ ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చాడు

Advertisement
Nikhil
Aishwarya Menon
Sanya Thakur
Spy Movie

More Telugu News