Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు జ్వరం... వారాహి యాత్రకు బ్రేక్

Two days break for Pawan Kalyan Varahi Yatra
షార్ట్స్‌లో చూడండి
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు రెండ్రోజుల విరామం ప్రకటించారు. జనసేనాని పవన్ కల్యాణ్ జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన గత కొన్నిరోజులుగా వారాహి నవరాత్రుల ఉపవాస దీక్షలో ఉన్నారు. ఉపవాసంతో కొద్దిగా నీరసించిన పవన్... జ్వరంతో మరింత నీరసించారు. దాంతో వారాహి యాత్రను తాత్కాలికంగా నిలిపివేసి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోనే విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించారు. 

పవన్ గత రాత్రి నరసాపురం సభ అనంతరం భీమవరం చేరుకున్న సంగతి తెలిసిందే. భీమవరంలో ఈ నెల 30న జనసేన బహిరంగ సభ నిర్వహించనున్నారు. పవన్ కల్యాణ్ ఈ నెల 14 నుంచి ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వారాహి విజయ యాత్ర చేపడుతున్నారు. తొలి విడత 11 నియోజకవర్గాల్లో వారాహి యాత్ర సాగనుంది.
Go Back to Shorts
Pawan Kalyan
Varahi Yatra
Bhimavaram
Janasena
West Godavari District

More Telugu News