400 కార్లలో అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరిన మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే.. వీడియో ఇదిగో!
- సొంతగూటికి చేరిన శివపురి ఎమ్మెల్యే బైజ్ నాథ్
- సింధియాతో కలిసి 2020 లో పార్టీ మారిన బైజ్ నాథ్
- బీజేపీలో టికెట్ రాదని నిర్ధారించుకుని పార్టీ మార్పు
అయితే, వచ్చే ఎన్నికల్లో శివపురి టికెట్ తనకు దక్కే సూచనలు కనిపించడంలేదని, లాబీయింగ్ చేసినా ఉపయోగం లేదని తేలిపోవడంతో బైజ్ నాథ్ పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు కాంగ్రెస్ నేతలతో జరిపిన చర్చలు ఫలించడంతో తిరిగి సొంతగూటికి వెళ్లనున్నట్లు బైజ్ నాథ్ ప్రకటించారు. కాంగ్రెస్ లో చేరిక సందర్భంగా ఎమ్మెల్యే బలప్రదర్శన చేపట్టారు. ఏకంగా 400 కార్లతో కాన్వాయ్ ఏర్పాటు చేసుకుని, శివపురి నుంచి భోపాల్ ప్రయాణించారు. ఈ ర్యాలీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.