రాహుల్ గాంధీ పేరు ఎత్తకుండా ఆయనకు కౌంటర్ ఇచ్చిన ఉప రాష్ట్రపతి
- రియర్‌వ్యూ మిర్రర్ లో చూస్తూ ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్న రాహుల్ గాంధీ
- ఈ విమర్శలపై పరోక్షంగా స్పందించిన జగ్‌దీప్ ధన్ కర్
- ప్రమాదం చేయాలని నిర్ణయించుకున్నవారి నుంచి తప్పించుకోవడానికి రియర్‌వ్యూ అద్దం చూడాలని చురక
మంగళవారం ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ అధికారులతో ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సమావేశమైన జగ్‌దీప్ ధన్‌కర్.. రాహుల్ ప్రభుత్వం చేసిన విమర్శలపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించకుండా చురకలు అంటించారు. దేశంలోని వ్యవస్థలపై బురదజల్లే వారిని దూరం పెట్టాలంటే రియర్‌వ్యూ మిర్రర్‌లో చూడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాదం చేయాలని నిర్ణయించుకున్నవారి నుంచి తప్పించుకోవడం కోసం రియర్‌వ్యూ మిర్రర్‌లో చూడాలని ఆయన వ్యాఖ్యనించారు. భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రథమ స్థానంలో ఉంటుందన్నారు. అయితే దేశంలోని కొందరు దీన్ని గర్వకారణంగా భావించడం లేదన్నారు. తప్పుడు మార్గదర్శనంలో నడుస్తున్న అలాంటి వారు భారత్ సాధిస్తున్న విజయాలను, మన సత్తాను తెలుసుకోలేక, అయోమయంలో ఉన్నారన్నారు.