Ram: మైసూరుకి బోయపాటి టీమ్ .. శ్రీలీలతో సందడి చేస్తున్న రామ్!

  • షూటింగు దశలో బోయపాటి మూవీ
  • రామ్ సరసన నాయికగా శ్రీలీల
  • మైసూరులో జరుగుతున్న పాట చిత్రీకరణ 
  • సంగీతాన్ని అందిస్తున్న తమన్ 
  • ఐదు భాషల్లో దసరాకి విడుదల కానున్న సినిమా
Ram and Boyapati movie update

రామ్ హిట్ అనే మాట విని చాలాకాలమైంది. అందువలన ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఆయన బోయపాటి సినిమా చేస్తున్నాడు. భారీ యాక్షన్ ఎంటర్టయినర్ గా ఈ సినిమా రూపొందుతోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది.ఈ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ దృశ్యాలను ఇటీవలే చిత్రీకరించారు. అందుకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను 24 రోజుల పాటు చిత్రీకరించినట్టు రామ్ చెప్పాడు కూడా. ఈ సినిమాకి సంబంధించిన ఒక పాటను చిత్రీకరించడానికి టీమ్ అంతా మైసూర్ చేరుకుంది. రామ్ - శ్రీలీలపై ఈ పాటను చిత్రీకరించనున్నారు.ఈ నెల 15వ తేదీ వరకూ ఈ పాటను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ తండ్రి పాత్రని బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ పోషించనున్నాడని అంటున్నారు. థమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో దసరాకి విడుదల చేయనున్నారు. 

More Telugu News