Nikhil: ఆసక్తిని రేపుతున్న నిఖిల్ లుక్ .. 'స్వయంభు' పోస్టర్ రిలీజ్!

  • నిఖిల్ తాజా చిత్రంగా రానున్న 'స్పై'
  • ఆ తరువాత సినిమాగా నిర్మితమవుతున్న 'స్వయంభు'
  • డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న సినిమా 
  • ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల  
Swayambhu Movie Special Poster Released

యువ కథానాయకులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేలా నిఖిల్ శ్రద్ధ తీసుకుంటూ వస్తున్నాడు. 'కార్తికేయ 2' సినిమాతో 100 కోట్లను మార్క్ ను టచ్ చేసిన హీరోగా నిలిచాడు. ఆ తరువాత వచ్చిన '18 పేజెస్' సినిమా, క్లాసికల్ హిట్ అనిపించుకుంది. ఇక త్వరలో ఆయన నుంచి 'స్పై' సినిమా రానుంది.

'స్పై' సినిమా అప్ డేట్స్ ఇప్పటికే అందరిలో ఆసక్తిని పెంచుతూ వెళుతున్నాయి. నిఖిల్ కొత్తగా ఏదో ట్రై చేశాడనే చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజున ఆయన బర్త్ డే సందర్భాన్ని పురస్కరించుకుని, మరో కొత్త సినిమా నుంచి పోస్టర్ ను రిలీజ్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఆ సినిమా పేరే 'స్వయంభు'. 

ఈ సినిమా పోస్టర్ లో నిఖిల్ ఒక యుద్ధవీరుడిగా కనిపిస్తున్నాడు. సినిమా మొత్తం కాకపోయినా, ఒక సందర్భంలో ఆయన ఇలా కనిపించే అవకాశం ఉండొచ్చు. ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతుందనే విషయం టైటిల్ ను బట్టే అర్థమైపోతోంది. కృష్ణ భరత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. 

More Telugu News